100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'
- మహేశ్ తాజా చిత్రంగా వచ్చిన 'సర్కారువారి పాట'
- తొలి రోజునే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా
- అదనపు బలంగా నిలిచిన పాటలు .. ఫైట్లు .. కామెడీ
- ఇంతవరకూ 160 కోట్లకి పైగా గ్రాస్ .. 100 కోట్లకి పైగా షేర్ వసూలు
ఇంతవరకూ ఈ సినిమా 160 కోట్లకి పైగా గ్రాస్ ను .. 100 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. చాలా వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడాన్ని విశేషంగా చెబుతున్నారు. ఈ వసూళ్లను అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్ లో తన దూకుడు చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
మహేశ్ సరసన కీర్తి సురేష్ కథానాయికాగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు .. ఫైట్లు .. మహేశ్ మార్కు కామెడీ .. సముద్రఖని విలనిజం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం.