తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్
- ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ
- జస్టిస్ శర్మ స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం
- ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ భుయాన్
తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం ఆయన స్థానంలో జస్టిస్ భుయాన్‌కు పదోన్నతి కోసం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసుల మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.