తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

Telangana corona updates
  • గత 24 గంటల్లో 12,435 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 18 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 62 మంది
  • ఇంకా 374 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,435 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 62 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,92,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,142 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 374 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Daily Bulletin

More Telugu News