సోనాల్ చౌహాన్ పాత్ర ఏంటనేది మాత్రం చెప్పను: అనిల్ రావిపూడి

F3 movie update
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి పేరు ముందువరుసలో కనిపిస్తుంది. 'పటాస్' నుంచి ఇంతవరకూ ఆయన చేసిన ప్రతి సినిమా .. ఒకదానికి మించి మరొకటి హిట్ కొట్టాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఎఫ్ 3' సినిమా సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. ఆ సినిమాలో మాదిరిగానే వెంకటేశ్ - తమన్నా ఒక జోడీగా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ ఒక జంటగా ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే కొత్తగా ఈ సినిమాలో మాత్రం సోనాల్ చౌహాన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. 

 తాజా ఇంటర్వ్యూలో సోనాల్ పాత్రను గురించిన ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఆమె పాత్రను గురించి మాత్రం అడగొద్దు .. అది సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది" అంటూ ఆయన మరింత ఆసక్తిని పెంచేశాడు.
Go Back to Shorts
Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi
F3 Movie

More Telugu News