యువతిపై అత్యాచారం అభియోగాలు.. రాజస్థాన్ మంత్రి కుమారుడికి సమన్లు
- గతేడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య రోహిత్ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ యువతి ఫిర్యాదు
- అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 15 మంది పోలీసులు
- రోహిత్ లేకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఇంటికి సమన్లు
- 18న విచారణకు రావాలని ఆదేశం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి 15 మంది పోలీసులు నిన్న ఉదయం జైపూర్ వెళ్లారు. అయితే, రోహిత్ లేకపోవడం, అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆయన ఇంటికి సమన్ల కాపీ అతికించారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు.