Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న‌న్ను చంప‌డానికి కుట్ర‌.. ఓ వీడియో రికార్డు చేశాను.. న‌న్ను హత్య చేస్తే అది బయటపడుతుంది: ఇమ్రాన్ ఖాన్

recorded a video says imran khan
  • పాకిస్థాన్ తో పాటు విదేశాల్లో ఉన్న కొంద‌రు కుట్ర‌ప‌న్నార‌న్న‌ ఇమ్రాన్ 
  • తాను కొంద‌రికి వ్య‌తిరేకంగా ఉన్నట్లు కుట్ర‌దారులు భావిస్తున్నారని వ్యాఖ్య‌
  • వారి పేర్లను వీడియోలో రికార్డు చేశానని వివ‌ర‌ణ‌
కొంద‌రు తనను హత్య చేయడానికి కుట్ర ప‌న్నుతున్నార‌ని పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. త‌న‌ను చంపించేందుకు పాకిస్థాన్ తో పాటు విదేశాల్లో ఉన్న కొంద‌రు కూడా ప్రయత్నిస్తున్నట్లు త‌నకు తెలుసు అని చెప్పారు. త‌నకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ఓ వీడియోను రికార్డు చేశానని అన్నారు. 

దీనిని ఓ సురక్షిత ప్రదేశంలో భద్రపరిచానని, ఒక‌వేళ త‌న‌ను హత్య చేస్తే, ఆ వీడియో బయటపడుతుందని చెప్పుకొచ్చారు. తాను కొంద‌రికి వ్య‌తిరేకంగా ఉన్నట్లు కుట్ర‌దారులు భావిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. త‌న‌పై కుట్ర ప‌న్నుతోన్న వారి పేర్లను తాను ఓ వీడియోలో రికార్డు చేశానని అన్నారు. కాగా, పాకిస్థాన్ ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోయిన అనంత‌రం ఇమ్రాన్ ఖాన్ ప‌లు సార్లు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు.
Imran Khan
Pakistan
pti

More Telugu News