అంబటి రాయుడు రిటైర్ అవ్వట్లేదు: చెన్నై జట్టు సీఈఓ
- మధ్యాహ్నం రిటైర్మెంట్‌పై ట్వీట్ చేసిన రాయుడు
- కాసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేసిన క్రికెటర్
- రాయుడు రిటైర్మెంట్ అవ్వట్లేదన్న చెన్నై జట్టు సీఈఓ
అంబటి రాయుడు రిటైర్మెంట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తోసిపుచ్చింది. రాయుడు రిటైర్ అవ్వట్లేదని చెప్పిన సీఎస్కే జట్టు సీఈఓ విశ్వనాథ్... పొరపాటుగా ఆ ట్వీట్ పెట్టి ఉంటాడని చెప్పారు. తాను రాయుడితో స్వయంగా మాట్లాడానని కూడా ఆయన తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో తన ఆటతీరు పట్ల రాయుడు అసంతృప్తిగా ఉన్నాడని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే రాయుడు పొరపాటున ఆ ట్వీట్ పెట్టి ఉంటాడన్న విశ్వనాథ్...రాయుడు కచ్చితంగా రిటైర్ అవ్వట్లేదని తెలిపారు.