ఎంజీఆర్ తరువాత నా పేరు వేయమంటే కుదరదన్నారు: 'షావుకారు' జానకి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంజీఆర్ తరువాత నా పేరు వేయమంటే కుదరదన్నారు: 'షావుకారు' జానకి

Shavukaru Janaki Inrerview
  • వందల సినిమాలు చేసిన 'షావుకారు' జానకి
  • అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న నటి
  • ఎంజీఆర్ తో హీరోయిన్ గా చేసినా ఆయన తరువాత పేరు వేయలేదంటూ వ్యాఖ్య  
1950లలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికలలో జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో ఆమె పేరు 'షావుకారు జానకి' అయిపోయింది. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె, నిన్నమొన్నటి వరకూ సినిమాలు చేస్తూనే వచ్చారు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్ తో .. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. 
 
తెలుగుతో పాటు  ఇతర భాషల్లోను కథానాయికగా మెప్పించారు . తెలుగులో ఎన్టీఆర్ తో చేసిన ఆమె, తమిళంలో ఎంజీఆర్ తోను కలిసి నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "అప్పట్లో ఎంజీఆర్ హీరోగా ఓ హిందీ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. మీనాకుమారి చేసిన రోల్ కోసం ఎవరిని తీసుకుందామా అని వాళ్లు ఆలోచన చేస్తున్నారని తెలిసి నేను ఎంజీఆర్ గారికి కాల్ చేస్తే .. ఆ వేషం నాకు ఇచ్చారు.

ఆ సినిమా అంతా అయిన తరువాత ఎంజీఆర్ తరువాత జయలలిత పేరు వేశారు. ఈ సినిమాలో నేను కదా హీరోయిన్ .. ఎంజీఆర్ తర్వాత నా పేరు కదా వేయాలి అని జెమినీ వాసన్ గారిని అడిగాను. 'ఆ మాటలన్నీ ముందే జరిగిపోయాయి. జయలలిత పేరు తరువాతనే మీ పేరు వేయమన్నారు. మీ పేరు ముందేసి ఉంటే సినిమా ప్రాబ్లంలో పడుతుంది' అని ఆయన అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.   

Shavukar i Janaki
MGR
Jatalalitha

More Telugu News