మే 20 నుంచి ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్'.. ట్రైలర్ విడుదల చేసిన జీ5.. మీరూ చూడండి!
- థియేటర్లలో మోత మోగించిన 'ఆర్ఆర్ఆర్'
- ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తున్న భీమ్, అల్లూరి
- నీరు, నిప్పు ఒక శక్తిగా వస్తున్నాయన్న జీ5
ఇప్పటి వరకు థియేటర్లలో మోత మోగించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ చిత్రాన్ని మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను జీ5 కాసేపటి క్రితం విడుదల చేసింది. నీరు, నిప్పు కలిసి ఒక శక్తిగా వస్తున్నాయంటూ జీ5 పేర్కొంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఓటీటీలో రానుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.