తెలుగు రాష్ట్రాల్లో 'సర్కారువారి పాట' దూకుడు!
- మహేశ్ తాజా చిత్రంగా నిన్న విడుదలైన 'సర్కారువారి పాట'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- ఒక్క నైజామ్ లోనే 12.24 కోట్ల షేర్
- రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 36. 63 కోట్ల షేర్
అలాంటి ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా 36.63 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే 12. 24 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ .. ఉత్తరాంధ్ర .. ఉభయ గోదావరి జిల్లాలు .. గుంటూరు .. కృష్ణ .. నెల్లూరు జిల్లాల్లో మిగతా వసూళ్లను రాబట్టింది.
మహేశ్ మార్క్ కామెడీ .. ఆయన తరహా యాక్షన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. డాన్స్ లోను .. ఫైట్స్ లోను మహేశ్ పూర్తి ఫిట్ నెస్ తో కనిపించాడు. ఇక కీర్తి సురేశ్ కూడా ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. వీకెండ్లో ఈ సినిమా వసూళ్లు ఏ నెంబర్ ను టచ్ చేస్తాయో చూడాలి.