తెలంగాణలో కొత్తగా 39 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 13,422 కరోనా టెస్టులు
  • హైదరాబాదులో 28 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 28 మంది
  • ఇంకా 402 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 13,422 కరోనా పరీక్షలు నిర్వహించగా, 39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 28 కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,92,474 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 402 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు. 

Telangana
Corona Virus
New Cases
Update

More Telugu News