'సర్కార్ వారి పాట’ బాగుంది... మ‌హేశ్ సినిమాపై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌లు

vijay sai reddy praises sarkaru vaari paata movie
  • గురువారం విడుద‌లైన 'సర్కార్ వారి పాట’
  • సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించిన విజ‌య‌సాయిరెడ్డి
  • స‌మ‌కాలీన అంశాలతో సందేశాత్మ‌కంగా సాగింద‌ని వెల్ల‌డి
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన తాజా చిత్రం 'సర్కార్ వారి పాట’ గురువారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఈ సినిమాపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేర‌కు గురువారం మధ్యాహ్నం ఆయ‌న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని స‌ద‌రు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని కూడా సాయిరెడ్డి చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించారు.
Go Back to Shorts
YSRCP
Vijay Sai Reddy
Sarkaru Vaari Paata
Mahesh Babu

More Telugu News