పెళ్లి వేడుకలో సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు.. మృతి
- విశాఖలోని మధురవాడలో ఘటన
- స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన పెళ్లికూతురు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం పెళ్లికూతురు సృజన ప్రాణాలు కోల్పోయింది. విశాఖలోని మధురవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకలతో ఎంతో సంతోషంగా గడపాల్సిన వధూవరుల ఇళ్లలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.