తెలంగాణలో కొత్తగా 28 మందికి కరోనా

Telangana corona bulletin
  • గత 24 గంటల్లో 14,753 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 20 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 34 మంది
  • ఇంకా 377 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 14,753 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,92,389 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,901 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 377 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Daily Update

More Telugu News