Andhra Pradesh: 6 నెలల్లోగా సాగు మోటార్ల‌కు మీటర్లు బిగిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

ap minister peddireddy ramachandra reddy says will put meters toagri motors within 6 months
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపున‌కు సంబంధించి రాష్ట్ర స‌ర్కారు నుంచి సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న వెలువడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దీనిపై వివరాలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 18 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ విద్యుత్ మోటార్ల‌కు 6 నెల‌ల్లోగా మీటర్ల‌ను బిగిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేరకు సోమ‌వారం విద్యుత్ శాఖపై జ‌రిగిన స‌మీక్ష‌లో పెద్దిరెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 

వ్య‌వ‌సాయ విద్యుత్ మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపు వ‌ల్ల విద్యుత్ వినియోగంపై ఖ‌చ్చిత‌మైన స‌మాచారం తెలుస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. రైతుల‌కు నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. సాగు మోటార్ల‌కు మీట‌ర్ల ఏర్పాటుపై విప‌క్షాల‌ది అస‌త్య ప్ర‌చార‌మ‌ని మంత్రి ఆరోపించారు. 

రైతులు వినియోగించిన విద్యుత్ చార్జీల బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంద‌ని, ఆ బిల్లుల మొత్తాన్ని వారే నేరుగా డిస్కంల‌కు చెల్లిస్తార‌ని మంత్రి తెలిపారు. ఫ‌లితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి డిస్కంల‌లో జ‌వాబుదారీత‌నం పెరుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Peddireddi Ramachandra Reddy

More Telugu News