Balakrishna: యాక్షన్ కామెడీగా బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా!

Balakrishna in Anil Ravipudi movie
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ కోసం అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. బాలకృష్ణ 100వ సినిమానే తాను చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. ఈ మధ్యనే బాలకృష్ణకి అనిల్ ఒక కథ చెప్పడం ..  ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి.

ప్రస్తుతం  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఇది బాలకృష్ణకి 107వ సినిమా. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను బాలయ్య పోషించనున్నారట. 

ఫస్టాఫ్ అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తోను .. సెకండాఫ్ అంతా కూడా అనిల్ మార్కు కామెడీతోను ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక కథానాయికగా మెహ్రీన్ కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ అతిథి పాత్రను పోషించనున్నారని చెబుతున్నారు.  

Go Back to Shorts
Balakrishna
Anil Ravipudi
Tollywood

More Telugu News