డ్రైవర్ అతివేగం వల్లనే హసన్ పల్లి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది: పవన్ కల్యాణ్
- కామారెడ్డి జిల్లాలో దుర్ఘటన
- లారీని ఢీకొట్టిన టాటా ఏస్
- 9 మంది దుర్మరణం
- ఈ ఘటన బాధాకరమన్న పవన్ కల్యాణ్
కామారెడ్డి జిల్లాలో నిన్న నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గేటు వద్ద అతి వేగంగా వస్తున్న టాటా ఏస్... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం తెలిసిందే. కాగా, టాటా ఏస్ విపరీతమైన వేగంతో వస్తుండడాన్ని గమనించిన లారీ డ్రైవర్ రోడ్డు కిందకు దూసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.