మహేశ్ తో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను: పరశురామ్

Sarkaruvari  paata Movie  Update
  • ' సర్కారువారి పాట 'ప్రమోషన్స్ లో పరశురామ్
  • పూరి - గుణశేఖర్ ఇద్దరిదీ మా ఊరేనంటూ వివరణ 
  • ఇద్దరూ మహేశ్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారంటూ వ్యాఖ్య  
  • తాను కూడా హిట్ కొడతాననే నమ్మకం ఉందన్న పరశురామ్ 
టాలీవుడ్ దర్శకులలో పరశురామ్ కి కూడా మంచి పేరు ఉంది. 'గీత గోవిందం' సాధించిన హిట్ తో ఆయన స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఆయన తాజా చిత్రమైన 'సర్కారు వారి పాట' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

"నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ దగ్గరున్న 'నర్సీపట్నం'లో. దర్శకుడు గుణశేఖర్ .. పూరి జగన్నాథ్ ఊరు కూడా అదే. అందువలన వాళ్లిద్దరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. 'ఒక్కడు' సినిమాతో మహేశ్ బాబుకి గుణశేఖర్ తిరుగులేని హిట్ ఇచ్చాడు. ఇక 'పోకిరి' సినిమాతో మహేశ్ కి పూరి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. 

దాంతో నేను కూడా ఎప్పటికైనా మహేశ్ తో ఒక సినిమా చేయాలనీ .. ఆయనతో కలిసి గట్టి హిట్ కొట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అది ఈ సినిమాతో నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఈ కథను మహేశ్ కోసమే రాశాను .. ఆయన ఒప్పుకోకపోతే ఈ సబ్జెక్ట్ ను పక్కన పెట్టేవాడినంతే" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkatuvari Pata

More Telugu News