Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇండియా కరోనా అప్డేట్స్ ఇవిగో!

India registers 3805 Corona cases
  • గత 24 గంటల్లో 3,805 కరోనా కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 3,168 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,303
దేశంలో కారోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.8 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 3,805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఢిల్లీలో 1,656 కేసులు నమోదు కాగా ముంబైలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో దాదాపు 400 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 22 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో 20 మరణాలు కేరళలో నమోదయ్యాయి. 

కరోనా నుంచి నిన్న 3,168 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటింది. యాక్టివ్ కేసులు 20,303కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,90,00,94,982 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 17,49,063 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
India
Corona Virus
Updates

More Telugu News