అడివి శేష్ 'మేజర్' ట్రైలర్ చూసిన రాజ్ నాథ్ సింగ్... చిత్రబృందానికి అభినందనలు
Add ap7am to your home Screen

అడివి శేష్ 'మేజర్' ట్రైలర్ చూసిన రాజ్ నాథ్ సింగ్... చిత్రబృందానికి అభినందనలు

Rajnath Singh watches Adivi Sesh starred Major cinema trailer
  • ముంబయి ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం
  • ఆయన జీవితకథతో మేజర్ చిత్రం
  • మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ 
  • మే 9న ట్రైలర్ రిలీజ్
  • రాజ్ నాథ్ కు ముందే చూపించిన చిత్రబృందం
ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకుడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించాడు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

కాగా, ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చూపించింది. మేజర్ ట్రైలర్ ను వీక్షించిన రాజ్ నాథ్... చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ఈ సందర్భంగా మేజర్ చిత్ర స్లోగన్ ను విడుదల చేశారు. వాస్తవానికి మేజర్ చిత్రం ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కానుంది. అయితే, కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు ట్రైలర్ ను ముందే చూపించారు. ఈ చిత్రం జూన్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Rajnath Singh
Major
Trailer
Adivi Sesh

More Telugu News