ఆత్మీయుడిని కోల్పోయా!... బొజ్జల మృతిపై కేసీఆర్ సంతాపం!
- అనారోగ్యంతో బొజ్జల మృతి
- సహచరుడిని కోల్పోయానన్న కేసీఆర్
- బొజ్జల కుటుంబానికి సానుభూతి ప్రకటించిన సీఎం
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసినంతనే తన ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు.