నాడు హాలిడేస్, నేడు హ్యాపీడేస్.. విద్యుత్ కోతలపై టీఆర్ఎస్ ఇంటరెస్టింగ్ ట్వీట్
- సమైక్య రాష్ట్రంలో పవర్ హాలీడేలు
- ప్రత్యేక తెలంగాణలో కోతలు లేని విద్యుత్ సరఫరా
- పారిశ్రామిక ప్రగతి పథంలో తెలంగాణ అన్న టీఆర్ఎస్
నాడు సమైక్య రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో పవర్ హాలిడేస్ కారణంగా పరిశ్రమలకు తాళాలు పడ్డాయని టీఆర్ఎస్ ప్రస్తావించింది. అయితే నేడు సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతర కరెంటుతో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని వెల్లడించింది. అందుకే తెలంగాణలో ఇప్పుడంతా హ్యాపీడేసేనన్నట్లుగా టీఆర్ఎస్ ఆ ట్వీట్‌ను సంధించింది.