రాహుల్ గాంధీ ఎక్క‌డికెళితే అక్క‌డ కాంగ్రెస్ గ‌ల్లంతు: హ‌రీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీ ఎక్క‌డికెళితే అక్క‌డ కాంగ్రెస్ గ‌ల్లంతు: హ‌రీశ్ రావు

harish rao harsh comments on rahul gandhi
  • చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకున్న హీన చ‌రిత్ర కాంగ్రెస్‌దన్న హరీశ్ 
  • రాహుల్ తెలంగాణ‌కు ఎందుకు వ‌స్తున్నారో చెప్పాలని డిమాండ్ 
  • రాహుల్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ కంటే దిగ‌జారింద‌న్న హ‌రీశ్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ ఎక్క‌డికి వెళితే...అక్క‌డ కాంగ్రెస్ పార్టీ గ‌ల్లంతు అవుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బుధ‌వారం నాడు జ‌గిత్యాల జిల్లా, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో ప‌ర్య‌టించిన హ‌రీశ్ రావు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన హ‌రీశ్ రావు.. రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వ‌స్తున్నారో చెప్పాల‌ని హ‌రీశ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోయింద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ ద్రోహి అయిన చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకున్న హీన‌మైన చ‌రిత్ర కాంగ్రెస్‌ద‌ని హ‌రీశ్ రావు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.
TRS
Harish Rao
Congress
Rahul Gandhi

More Telugu News