మధుమేహుల కోసం మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు
- గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి కావాలి
- మంచి పోషకాలు అందేలా చూసుకోవాలి
- మేథి పరాటా, ఉడికించిన శనగలు మంచివి
- రాగి దోశ ఎంతో సింపుల్
మెంతి ఆకులతో చేసుకునే పరాటా. ఇందుకు గోధుమ పిండి, మెంతి కూర, బీన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ, నూనె కావాలి. మెంతుల్లో జీఐ చాలా తక్కువ. మధుమేహం ఉన్న ఎవరికైనా ఇది మంచి చేస్తుంది. మేథి పరాటాను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు పెరగకుండా ఉండడమే కాకుండా, మంచి పోషకాలు లభిస్తాయి.
శనగ పిండి, మెంతి కూరతో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఇది. మంచి ఫైబర్ తో పాటు, మెగ్నీషియం తగినంత అందుతుంది. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు నీరు, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, కారం, గ్రీన్ చిల్లీ, ఒక కప్పు మెంతి ఆకులు (తరిగినవి), నూనె కావాలి.
ఆమ్లెట్ కంటే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది. దీనివల్ల నూనెతో అవసరం పడదు.
శనగలతో చేసుకునే చాట్ ఇది. ఒక రాత్రంతా శనగలను నాన బెట్టి, మర్నాడు ఉదయం వాటిని ప్రెషర్ కుక్కుర్ లో ఉడికించి, వాటికి ఉడికించిన బంగాళాదుంపలు, మసాలా జోడించుకుని తినేయడమే. ఒక కప్పు శనగలు., అర కప్పు కొత్తిమీర ఆకులు, గ్రీన్ చిల్లీ, తరిగిన ఆనియన్, ఒక కప్పు ఉడికించిన బంగాళా దుంపలు (ముక్కలుగా కోసుకున్నవి), ఉప్పు, చాట్ మసాలా, జీర, కొద్దిగా నిమ్మరసం అవసరమవుతాయి.
రాగి పిండితో దోశ పోసుకోవడం వల్ల మంచి పోషకాలు అందడమే కాదు.. రక్తంలో గ్లూకోజ్ కూడా చక్కటి నియంత్రణలో ఉంటుంది. రాగి, గోధుమ పిండి, మజ్జిగ కలిపి రాత్రంతా అలా ఉంచేసి మర్నాడు ఉదయం దోశలా పోసుకుని తినేయడమే.