Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఈ భాషే కావాలంటే.. తిండి కూడా దొరకదు: సుహాసిని

Actors should speak all languages says Suhasini
  • సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న హిందీ లాంగ్వేజ్ వార్
  • హిందీ నేర్చుకోవాలన్న సుహాసిని
  • హిందీ సినిమాలు చేసుకోవాలంటూ సుహాసినిని ట్రోల్ చేస్తున్న తమిళ యువత
హిందీ భాషకు సంబంధించి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ల మధ్య ప్రారంభమైన వార్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి సీనియర్ నటి సుహాసిని ఎంటర్ అయ్యారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని... అది కూడా నేర్చుకోవాలని సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని... హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని అన్నారు. 

తమ ఇంట్లో పని చేసేవాళ్లలో తెలుగు మాట్లాడేవాళ్లతో పాటు హిందీ మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారని సుహాసిని చెప్పారు. ఈ భాషే కావాలని భీష్మించుకుంటే మనకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.
Suhasini
Tollywood
Kollywood
Hindi

More Telugu News