బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు యాక్సిడెంట్!

Actress Tanushree Dutta meets with accident
  • తనుశ్రీ ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్
  • నిన్న గుడికి వెళ్తుండగా ప్రమాదం
  • చిన్నచిన్న గాయాలతో బయటపడ్డామన్న తనుశ్రీ
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో యాక్సిడెంట్ జరిగింది. నిన్న మహాకాళ్ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తనుశ్రీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. గుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని... అయితే చిన్నచిన్న గాయాలతో అందరం బయటపడ్డామని తెలిపింది. తనకు కొన్ని కుట్లు పడ్డాయని చెప్పింది. అమ్మవారి ఆశీర్వాదాలతో ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదని... జై శ్రీ మహాకాళ్ అని పోస్ట్ చేసింది. 

మరోవైపు... త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. అమ్మవారే మిమ్మల్ని కాపాడారని అంటున్నారు. తనుశ్రీ దత్తా తెలుగు సినిమాలో కూడా నటించారు. బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో ఆమె మెరిశారు. అంతేకాదు 'మీ టూ' ఉద్యమం సమయంలో ఆమె పేరు మోగిపోయింది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య గురించి ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
Go Back to Shorts
Tanushree Dutta
Bollywood
Road Accident

More Telugu News