ప్రారంభమైన మోటో జీ52 విక్రయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రారంభమైన మోటో జీ52 విక్రయాలు

Moto G52 sales starts in India today
  • 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన ఓఎల్ఈడీ డిస్ ప్లే
  • ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్
  • రెండు రకాల వేరియంట్లలో లభ్యం
మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జీ52 విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ఈ ఫోన్ ను మోటోరోలా ఆవిష్కరించడం తెలిసిందే. అందుబాటు ధరలోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్ ను మోటోరోలా తీసుకురావడం గమనించాలి.

90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో, 6.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బడ్జెట్ విభాగంలో తక్కువ బరువు, స్లిమ్ గా ఉంటుందని మోటోరోలా ప్రకటించింది. 

4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499. హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రొసిలైన్ వైట్, చార్ కోల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో పనిచేస్తుంది. దీనికి సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 

వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంటాయి. ఐపీ 52 రేటింట్ తో ఈ ఫోన్ వస్తుంది. నీటి చుక్కలు పడినా రక్షణ ఉంటుంది. డాల్బీ ఆటోమ్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్లిప్ కార్ట్ పోర్టల్ పై కొనుగోలు చేసుకోవచ్చు.
Moto G52
sales
Flipkart

More Telugu News