ఏపీలో మరో దారుణం.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోన్న మహిళపై అత్యాచారం
- ఉపాధి కోసం విజయనగరం వచ్చిన మహిళ
- టీ దుకాణంలో పనిచేస్తోన్న బాధితురాలు
- గత అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి తలుపుకొట్టిన దుండగులు
- ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం
పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఉపాధి కోసం ఓ మహిళ విజయనగరం వచ్చి టీ దుకాణంలో పనిచేస్తోంది. గత అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి తలుపుకొట్టిన కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశారు. ఈ రోజు ఉదయం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.