రంజాన్ పండుగ నేపథ్యంలో.. హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రంజాన్ పండుగ నేపథ్యంలో.. హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

traffic restrictions in hyd
  • రంజాన్ సందర్భంగా కళకళలాడుతున్న మార్కెట్లు 
  • ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు ఆంక్ష‌లు 
  • హైద‌రాబాద్‌లో భ‌ద్ర‌త పెంపు
హైద‌రాబాద్‌లో రంజాన్ పండుగ వాతావ‌ర‌ణంతో మార్కెట్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. రేపు రంజాన్ పండుగ సంద‌ర్భంగా న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనుండ‌డంతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రంజాన్ ప్రార్థ‌నల నేప‌థ్యంలో రేపు ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 వైపు వచ్చే వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. 

అలాగే, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ మీదుగా మళ్లిస్తామని అన్నారు. లక్టీకాపూల్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 1/12 వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా వెళ్లాల‌ని వివ‌రించారు. 

ఈద్గా మీరాలం ట్యాంక్‌ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలు పురానాపూల్, కిషన్ బాగ్, బహదూర్ పురా చౌరస్తా మీదుగా వెళ్లాల‌ని అన్నారు. అలాగే, సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్‌ రోడ్స్‌ దాటి వెళ్ల‌నివ్వ‌బోమ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు, శివరాంపల్లి, నేషనల్‌ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే వాహ‌నాల‌ను ధనమ్మ గుడిసెలు ఉండే టీ-జంక్షన్‌ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్‌ టౌన్‌ హైస్కూల్‌ మీదుగా మ‌ళ్లిస్తామ‌ని చెప్పారు. కాగా, రంజాన్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పోలీసులు భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు.
traffic
Hyderabad

More Telugu News