చెట్టుకి త‌ల‌కిందులుగా వేలాడదీసి యువ‌కుడిని కొట్టిన వైనం.. వీడియో ఇదిగో

A man was thrashed by 5 people as he was hung upside down
  • ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఘ‌ట‌న‌
  • ఓ ఇంట్లో చొర‌బ‌డ‌డానికి య‌త్నించిన యువ‌కుడు?
  • అందుకే మ‌రుస‌టి రోజు ప‌ట్టుకుని కొట్టిన వైనం
ఓ యువ‌కుడిని చెట్టుకి తాళ్ల‌తో కట్టి త‌ల కిందులుగా వేలాడ‌దీసి కొట్టారు కొంద‌రు వ్య‌క్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఉచ్ఛ్‌భ‌ట్టీ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

గ్రామంలోని ఒక‌రి ఇంట్లో మొన్న‌ రాత్రి స‌మ‌యంలో చొర‌బ‌డ‌డానికి మ‌హ‌వీర్‌ సూర్య‌వంశీ అనే యువ‌కుడు ప్ర‌య‌త్నించ‌డంతో అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి స్థానికులు య‌త్నించారని తెలిసింది. అయితే, సూర్యవంశీ తప్పించుకుని పారిపోవ‌డంతో అత‌డిని నిన్న ఉద‌యం ప‌ట్టుకుని చెట్టుకి త‌ల‌కిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
Go Back to Shorts
Chhattisgarh
Crime News

More Telugu News