కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పంద‌న ఇదే

gvl narasimharao fires on ktr comments
  • తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏపీకి కాకుండా యూపీకి పంపండి
  • డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా ప‌నిచేస్తుందో చూస్తారు
  • బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంద‌న్న జీవీఎల్‌
తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జ‌రుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పొరుగు రాష్ట్రానికి పంపాల‌ని త‌న మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ వైపు ఏపీ మంత్రులు వ‌రుస‌బెట్టి ప్ర‌తిస్పందిస్తుండ‌గా...బీజేపీకి చెందిన కీల‌క నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మ‌రో విధంగా స్పందించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పొరుగు రాష్ట్రానికి కాకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపాల‌ని ఆయ‌న కేటీఆర్‌కు సూచించారు. 

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా జీవీఎల్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పాల‌కులు త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపాల‌ని జీవీఎల్ సూచించారు.  అవినీతిని,అరాచకాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వం  ఎలా బుల్డోజింగ్ చేస్తుందో తెలంగాణ‌ ప్రజలు చూస్తారని జీవీఎల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంద‌న్న జీవీఎల్‌...తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపే ధైర్యం ఉందా?అంటూ కేటీఆర్‌కు జీవీఎల్ స‌వాల్ విసిరారు.
Go Back to Shorts
BJP
GVL Narasimha Rao
KTR
Uttar Pradesh

More Telugu News