ఏపీలో తాజాగా 8 మందికి కరోనా

Eight people tested covid positive in AP
  • రోజువారీ బులెటిన్ విడుదల చేసిన కమాండ్ కంట్రోల్
  • 4,577 మందికి కరోనా పరీక్షలు
  • ఏలూరు, విశాఖ జిల్లాల్లో రెండేసి కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న నలుగురు
ఏపీలో కరోనా పరిస్థితులకు సంబంధించిన రోజువారీ బులెటిన్ ను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసింది. కరోనా వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో, బులెటిన్ ను పాక్షిక వివరాలతో రూపొందిస్తున్నారు. గడచిన 24 గంటల్లో 4,577 కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

ఏలూరు జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 1, బాపట్ల జిల్లాలో 1, తిరుపతి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Today Cases

More Telugu News