నిన్న‌టి మ్యాచ్‌లో రిష‌భ్ పంత్ ప‌ట్టిన క్యాచ్ వీడియో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిన్న‌టి మ్యాచ్‌లో రిష‌భ్ పంత్ ప‌ట్టిన క్యాచ్ వీడియో వైర‌ల్

pant video goes viral
  • కోల్‌కతా నైట్ రైడర్స్ ను ఓడించిన‌ ఢిల్లీ కేపిటల్స్ 
  • ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ 
  • శ్రేయాస్‌ అయ్యర్‌ కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నం 
  • 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో ప‌ట్టేసిన పంత్
ఐపీఎల్ లో భాగంగా గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ఢిల్లీ కేపిటల్స్ ఓడించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచులో రిష‌భ్‌ పంత్ ప‌ట్టిన ఓ క్యాచ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించ‌గా, బంతి ఎడ్జ్‌ తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో ఆ బాల్ ను వికెట్‌ కీపర్‌ పంత్ 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో ప‌ట్టేశాడు. ఆ త‌ర్వాత పంత్ క్యాచ్‌కు పంత్‌ అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. ఈ క్యాచ్ ను రిప్లేలో చూశారు. బ్యాట్‌ను బంతి  తాకినట్లు అందులో కనపడ‌డంతో ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో బాగా రాణించిన శ్రేయాస్‌ అయ్యర్ ను పంత్ ఈ విధంగా ఔట్ చేయ‌డంతో శ్రేయాస్ నిరాశతో పెవిలియన్‌కు వెళ్లాడు. 

ఆ త‌ర్వాత‌ ఆదే ఓవర్‌లో రస్సెల్‌ను కూడా స్టంప్‌ చేసి పంత్ ఔట్ చేయ‌డం గ‌మ‌నార్హం. పంత్ ప‌ట్టిన క్యాచ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయ‌న‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గ‌తంలోనూ పంత్ ఇలాగే అద్భుత‌మైన రీతిలో క్యాచ్‌లు ప‌ట్టిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 42 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
pant
Cricket
Viral Videos

More Telugu News