నిరసనకు వెళ్లిన నారా లోకేశ్... గజ మాలతో ఆహ్వానించిన టీడీపీ శ్రేణులు
- డోలాస్ నగర్లో పర్యటించిన నారా లోకేశ్
- ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ
- ప్రజల సమస్యలపై ఆరా తీసిన టీడీపీ నేత
పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకం అయిన లోకేశ్... వారి సమస్యలపై ఆరా తీశారు. ఇళ్ల పట్టాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు, ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గెలిచిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్ష కట్టి ఇళ్లు కూల్చడం మొలదలెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు.