Karumuri Nageswar Rao: హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్న ఘనత జగన్ ది: మంత్రి కారుమూరి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు అందేలా చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు హామీ ఇవ్వని పథకాలను సైతం అమలు చేస్తున్న ఘనత జగన్ దని చెప్పారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. మన దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మూడు సార్లు గుర్తింపు పొందారని చెప్పారు. తణుకులో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని మహిళలకు మంజూరైన పది కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి జగన్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు.