Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిమ్స్ త‌ర‌హాలో టిమ్స్‌...ఎల్బీ న‌గ‌ర్‌లో స‌ర్కారీ ఆసుప‌త్రికి కేసీఆర్ భూమి పూజ‌

kcr laid foundation stone for tims hospital at lb nagar
  • ఫ్రూట్ మార్కెట్ స్థ‌లంలో ఆసుప‌త్రి నిర్మాణం
  • నిమ్స్ త‌ర‌హాలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం
  • భూమి పూజ‌కు హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయ‌ర్‌
హైద‌రాబాద్‌లో ప్ర‌సిద్ధిగాంచిన నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) త‌ర‌హాలో తెలంగాణ స‌ర్కారు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (టిమ్స్‌)కు శ్రీకారం చుట్టింది. ఈ మేర‌కు టిమ్స్ పేరిట నూత‌నంగా నిర్మించనున్న ఆసుపత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్బీ న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. వేడుక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎల్బీ న‌గ‌ర్‌లోని ఫ్రూట్ మార్కెట్‌ను ఇటీవ‌లే ఖాళీ చేయించిన సంగ‌తి తెలిసిందే. టిమ్స్ పేరిట భారీ స్థాయిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం కోసమే అక్క‌డి ఫ్రూట్ మార్కెట్‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు గ‌తంలోనే తెలంగాణ స‌ర్కారు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మార్కెట్ త‌ర‌లింపున‌కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎట్టకేల‌కు మార్కెట్‌ను త‌ర‌లించేసిన స‌ర్కారు... ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టుగా అక్క‌డ టిమ్స్ పేరిట ఆసుప‌త్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
TIMS
NIMS
KCR
LB Nagar

More Telugu News