Nara Lokesh: నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అమానవీయ ఘటన: నారా లోకేశ్‌

nara lokesh slams jagan
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల వ‌ద్ద వ‌రుస‌గా అమాన‌వీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆయ‌న అన్నారు. 

''మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు వైఎస్‌ జ‌గన్ గారి చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి. తిరుపతి రుయా ఆసుప‌త్రి నుంచి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా కనికరం చూపలేదు.

ప్రైవేట్ అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది.

వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి'' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News