Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్‌...ఏం చెప్పారంటే..!

kcr phone call to vasalamarri sarpanch
  • యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌
  • వాసాల‌మ‌ర్రి అభివృద్ధిపై దృష్టి
  • స్వ‌యంగా గ్రామ స‌ర్పంచ్‌కు ఫోన్‌
  • ప‌లు వివ‌రాలు ఆరా తీసిన కేసీఆర్‌
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమ‌వారం యాదాద్రి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రి అభివృద్ధిపై దృష్టి సారించారు. గ్రామంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, అందుకోసం అవ‌స‌ర‌మ‌య్యే నిధులు, ద‌ళిత బంధు అమ‌లు త‌దిత‌రాల‌పై ఆయ‌న దృష్టి సారించారు. ఈ విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఆయ‌న నేరుగా వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌కు స్వ‌యంగా ఫోన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా గ్రామంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌కు సంబందించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాల‌ని స‌ర్పంచ్‌కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ద‌ళిత బంధు కింద గ్రామంలో ఎంపికైన ల‌బ్ధిదారుల ఆదాయ‌, వ్య‌యాల వివ‌రాల‌ను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అర్హులైన అంద‌రికీ ద‌ళిత బంధు అందేలా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని కూడా గ్రామ స‌ర్పంచ్‌కు కేసీఆర్ సూచించారు.
KCR
TRS
Yadadri
Vasalamarri

More Telugu News