తెలంగాణలో ఒంటరిగానే పోటీ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- 2023 చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
- ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ప్రచారం
- ఆ ప్రచారంపై క్లారిటీ ఇస్తూ రేవంత్ రెడ్డి ప్రకటన
- ఒంటరిగానే బరిలోకి దిగి కేసీఆర్‌ను ఓడిస్తామన్న రేవంత్
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి పలు వ్యూహాలను ఆయన సోనియాకు అందించారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఖాయమన్న వార్తలు గడచిన రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొనగా... దానిపై క్లారిటీ ఇచ్చే దిశగా తాజాగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.