Suman: నేల చూడకుండా డాన్స్ చేసే స్టార్ ఒక్క చిరంజీవిగారే: హీరో సుమన్

Suman Interview
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై మార్షల్ ఆర్ట్స్ తో విజృంభించిన హీరోల జాబితాలో సుమన్ ఒకరుగా కనిపిస్తారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే  కథల్లో అర్జున్ .. భానుచందర్ .. సుమన్ ఒక ప్రత్యేకమైన ముద్రవేశారు. కొంతకాలం తరువాత అర్జున్ .. భానుచందర్ తమిళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

సుమన్ మాత్రం టాలీవుడ్ సినిమాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. యాక్షన్ సినిమాల నుంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. ఇప్పటి సీనియర్ హీరోలకు ఒకప్పుడు అయన గట్టిపోటీ ఇచ్చారు. 

అలాంటి సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం. అయినా డాన్స్ విషయానికొస్తే చిరంజీవిగారి డాన్స్ నచ్చుతుంది. చిరంజీవిగారు నేల చూడకుండా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది .. ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. అయితే వాటిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Suman
Chiranjeevi
Tollywood

More Telugu News