అప్పుడు ధోనీ కిట్‌ బ్యాగ్‌ను తన్నాడు: షేన్ వాట్స‌న్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు ధోనీ కిట్‌ బ్యాగ్‌ను తన్నాడు: షేన్ వాట్స‌న్

shane watson praises dhoni
  • ధోనీకి ఎప్పుడైనా కోపం వ‌స్తుందా అని  చాలామంది మాట్లాడుకుంటారన్న వాట్స‌న్
  • ధోనీ అసహనానికి గురి కావడం తాను చూశాన‌ని వ్యాఖ్య‌
  • 2019 ఫైనల్లో ముంబయితో జ‌రిగిన మ్యాచులో చెన్నై ఓటమి
  • దీంతో ధోనీకి కాసేపు కోపం వచ్చిందని వివ‌ర‌ణ‌
ధోనీకి ఎప్పుడైనా కోపం, చిరాకు వస్తాయా? అన్న‌ విషయాల గురించి చాలామంది మాట్లాడుకుంటారని, అయితే ఒకసారి ధోనీ అసహనానికి గురి కావడం తాను చూశాన‌ని ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు మాజీ ఆట‌గాడు షేన్ వాట్స‌న్‌ అన్నాడు. 2019 ఫైనల్లో ముంబయితో జ‌రిగిన మ్యాచులో చెన్నై ఓటమి పాల‌వ‌డంతో ధోనీకి కోపం వచ్చిందని చెప్పాడు. ధోనీ కిట్‌ బ్యాగ్‌ను తన్నాడని తెలిపాడు. ఆ కోపం ధోనీలో కాసేపే ఉంద‌ని చెప్పాడు. 

అలాగే, ఇటీవ‌లి ధోనీ ఆట‌ తీరుపై షేన్‌ వాట్సన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ముంబై జ‌ట్టుతో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచులో చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ భారీ షాట్లు కొట్టి చెన్నై జ‌ట్టుని గెలిపించిన విష‌యంపై వాట్స‌న్ స్పందిస్తూ.. చివరి ఓవర్లో ధోని భారీ షాట్లు ఆడుతుంటే మజా వచ్చిందని చెప్పాడు. 

తాను టీవీలో మ్యాచ్‌ చూస్తూ ధోనీ బౌండరీలు కొడుతుంటే అరుస్తూనే ఉన్నాన‌ని అన్నాడు. అది ప్రత్యేకమైన మ్యాచ్ అని, ఒత్తిడిలోనూ ధోనీ ప్రశాంతంగా ఉన్నాడని చెప్పాడు. మ్యాచ్ చూస్తోన్న తాను మాత్రం అలా ప్ర‌శాంతంగా ఉండలేకపోయాన‌ని అన్నాడు.
Shane Watson
MS Dhoni
Cricket

More Telugu News