రాజస్థాన్ రాయల్స్ పై టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్... మరో విజయం కోసం ఆరాటం
- ఐపీఎల్ లో ఆసక్తికర పోరు
- ముంబయి వాంఖెడే మైదానంలో మ్యాచ్
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- ఢిల్లీ జట్టుపై పడని కరోనా ప్రభావం
కాగా, ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు కొద్దిగా సహకరిస్తుందని భావిస్తున్నారు. రాజస్థాన్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్... ఢిల్లీ జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉండడంతో బంతికి, బ్యాట్ కు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది.
ఇటీవల ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగుచూడడం తెలిసిందే. ఆటగాళ్లు మిచెల్ మార్ష్, సీఫెర్ట్ లతో పాటు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, జట్టు మసాజర్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న మార్ష్ ను ఆసుపత్రికి తరలించి మిగతా వారిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇలాంటి నేపథ్యంలో, పంజాబ్ పై మ్యాచ్ లో ఢిల్లీ స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చి 9 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.