ధోనీ ఆటతీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు
- చెన్నై జట్టుని గెలిపించిన ధోనీ
- వయసు అనేది ఒక అంకె మాత్రమేనన్న కేటీఆర్
- ధోనీ ఓ ఛాంపియన్.. అసాధారణ ఫినిషర్ అని ప్రశంసలు
'వాస్తవానికి వయసు అనేది ఒక అంకె మాత్రమే. ధోనీ ఓ ఛాంపియన్.. అసాధారణ ఫినిషర్.. ఓ లెజెండ్' అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, చెన్నై జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో ముంబైతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో ధోనీ ధనా ధన్ షాట్లు కొట్టి జట్టును గెలిపించాడు.