మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా!
- నిన్న 12 మంది విద్యార్థులకు కరోనా
- ఈరోజు మరో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
- 90 శాతం కేసులు ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ కు చెందినవి
అయితే ఈ కేసులు హాస్టల్ లో వ్యాప్తి చెందుతుండటంతో మద్రాస్ ఐఐటీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ఐఐటీలో కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ అని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. మరోవైపు ఏకంగా 30 కేసులు వెలుగు చూడటంతో ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.