అవినీతిపై యాప్ వస్తే సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు చేస్తా: నారా లోకేశ్
- దుగ్గిరాల మండలంలో పర్యటించిన లోకేశ్
- మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ప్రకటన
- ఏపీని చూస్తుంటే బీహార్‌ను చూస్తున్నట్టే ఉందని వ్యాఖ్య
మంగళగిరి నియోజవర్గంలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో గురువారం పర్యటించిన సందర్భంగా లోకేశ్ పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బీహార్‌ను చూస్తున్నట్లు ఉందని ఆయన అన్నారు. మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తామని, టీడీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలిపారు. మంగళగిరి పౌరుషం ఏమిటో వైసీపీకి చూపిస్తామని లోకేశ్ అన్నారు.