కుమార మంగ‌ళం బిర్లాకు విందు ఇచ్చిన జ‌గ‌న్‌

ys jagan offers dinner to birla group chief
  • బలభద్రపురంలో బిర్లా కంపెనీకి చెందిన‌ యూనిట్‌
  • బిర్లాతో క‌లిసి యూనిట్‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • ప్రారంభోత్స‌వం అనంత‌రం జ‌గ‌న్‌తో క‌లిసి తాడేప‌ల్లికి బిర్లా
భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగ‌ళం బిర్లాకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న నివాసంలో గురువారం ప్ర‌త్యేక విందు ఇచ్చారు. తూర్పుగోదావ‌రి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూప్ ఆధ్వ‌ర్యంలోని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్‌ ప్రారంభానంతరం జ‌గ‌న్‌తో క‌లిసి కుమారమంగళం బిర్లా తాడేప‌ల్లి వ‌చ్చారు. 

ఈ సంద‌ర్భంగా కుమారమంగళంను త‌న నివాసంలోకి సాద‌రంగా ఆహ్వానించిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు ప్ర‌త్యేక విందు ఇచ్చారు. అనంత‌రం ఆయనకు ఓ జ్ఞాపిక‌ను కూడా బ‌హూక‌రించారు.
Go Back to Shorts
Birla Group
Kumara Mangalam Birla
YS Jagan

More Telugu News