రంగురంగుల క్యాప్సికం... ఆసక్తిగా పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
- సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న హరీశ్ రావు
- రేజింతల్‌లోని అత్యాధునిక పాలీ హౌస్‌ను సందర్శించిన వైనం
- రంగురంగుల క్యాప్సికం సాగుపై ఆరా తీసిన మంత్రి
ఈ సందర్భంగా రంగు రంగుల్లో ఉన్న క్యాప్సికంలను చేతిలోకి తీసుకున్న హరీశ్ రావు వాటిని ఆసక్తిగా పరిశీలించారు. ఆ తర్వాత వాటి సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం వంటి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.