పెళ్లి పందిరిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
- యూపీలోని హమీర్పూర్, లాల్పురాలో ఘటన
- పెద్దల సమక్షంలో పెళ్లి
- పెళ్లి ఇష్టంలేకే వరుడిని కొట్టిన వధువు?
యూపీలోని హమీర్పూర్, లాల్పురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడిని వధువు కొట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో వధువు మెడలో వరుడు దండ వేయగానే పెళ్లి కూతురు అతడిని కొట్టింది. అనంతరం పెళ్లి పందిరి నుంచి వెళ్లిపోయింది. వరుడు షాక్తో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.