పెళ్లి పందిరిలో వ‌రుడి చెంప‌ చెళ్లుమ‌నిపించిన‌ పెళ్లి కూతురు.. వీడియో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి పందిరిలో వ‌రుడి చెంప‌ చెళ్లుమ‌నిపించిన‌ పెళ్లి కూతురు.. వీడియో వైర‌ల్

bride slams groom
  • యూపీలోని హమీర్‌పూర్‌, లాల్‌పురాలో ఘ‌ట‌న‌
  • పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి
  • పెళ్లి ఇష్టంలేకే వ‌రుడిని కొట్టిన వ‌ధువు?
ఆ పెళ్లి వేడుక‌కు బంధు,మిత్రులు అంద‌రూ వ‌చ్చారు. పెళ్లి పందిరి వ‌ద్ద సంద‌డి నెల‌కొంది. వ‌ధువు, వ‌రుడు కుటుంబాల వారు చాలా సంతోషంగా పెళ్లి వేడుక‌లో పాల్గొంటున్నారు. ఇంత‌లో ఎవ‌రూ ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఎందుకంటే పెళ్లి పందిరిలోనే వ‌రుడి చెంప చెళ్లుమ‌నిపించింది పెళ్లి కూతురు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక‌నే ఇలా చేసింద‌ని తెలుస్తోంది. 

యూపీలోని హమీర్‌పూర్‌, లాల్‌పురాలో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వ‌రుడిని వ‌ధువు కొట్టిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. పెళ్లి వేడుకలో వధువు మెడలో వరుడు దండ వేయగానే పెళ్లి కూతురు అత‌డిని కొట్టింది. అనంత‌రం పెళ్లి పందిరి నుంచి వెళ్లిపోయింది. వ‌రుడు షాక్‌తో చూస్తూ ఉండ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయాడు.
Viral Videos
Uttar Pradesh

More Telugu News