Bandi Sanjay: పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..ఫొటోలు విడుద‌ల చేసిన బీజేపీ నేత‌

attack on bjp telangana chief bandi sanjay yatra
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై సోమ‌వారం నాడు రాళ్ల దాడి జ‌రిగింది. ఈ దాడిలో బండి సంజ‌య్ కాన్వాయ్‌లోని ప‌లు వాహ‌నాల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బండి సంజ‌యే వెల్ల‌డించారు. రాళ్ల దాడిలో త‌మ వాహ‌నాలు ఎలా ధ్వంస‌మ‌య్యాయ‌న్న విష‌యాన్ని తెలిపేందుకు ఆయ‌న ధ్వంస‌మైన వాహ‌నాల ఫొటోల‌ను కూడా షేర్ చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌న కాన్వాయ్‌పై జ‌రిగిన రాళ్ల దాడి టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిగానే బండి సంజ‌య్ ప‌రిగ‌ణించారు. టీఆర్ఎస్ శ్రేణులే త‌న పాద‌యాత్ర‌పై దాడి చేశాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ దాడితో ఏకంగా ఎంపీ అయిన త‌న‌కే భ‌ద్ర‌త లేద‌ని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన‌ట్టయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ‌పై రాళ్ల దాడి చేసిన వారికి బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ బుల్డోజ‌ర్‌ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌నున్న‌ట్లుగా బండి సంజ‌య్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
PrajaSangramaYatra

More Telugu News